ప్రియా..!
పగలంతా ఏం చేసినా నీ ఆలోచనలు
రేయంతా నువ్వులేని ఒంటరితనపు జాడలుఇదిగో వెల్లకిలా పడుకొని
ఇలా వెన్నెలలో ఆకాశంకేసి చూస్తుంటే
ఒక్కో తార ఒక్కో జ్ఞాపకంలా మారి మెరుస్తుంది.
నన్ను మురిపిస్తూ నీకు దగ్గరగా ఉన్నంత ఓదార్పు ఇస్తున్నట్టుగా...
అక్కడ నిన్ను...ఇక్కడ నన్ను..చూస్తున్న చంద్రుడు మాత్రం
మన ప్రేమ అంత నిర్మలంగా నవ్వుతున్నాడు.
నువ్వు కుశలమే అని నాకు తెలుపుతున్నట్టుగా...!

Hai IAM IN Vizag
రిప్లయితొలగించండి