జీవితంపట్ల ఒక మనిషికి ఉన్న దృక్పధమే అతని జీవితంలో
అత్యంత నిర్ణయాత్మకమైనది. దీనికి అర్ధం ఏమిటంటే-
ఒక మనిషి తన జీవితంలోని సంఘటనలను ఎటువంటి దృక్పధంతో చూస్తాడు,
వాటికి ఎలా ప్రతిస్పందిస్తాడు అన్నవి అన్నివిధాలా
అత్యంత కీలకమైన విషయాలు. ఒకే సంఘటనను ఇద్దరుమనుష్యులు వేరు వేరుగా చూడవచ్చు.
ఒక అమెరికా దేశస్థుడు , రష్యా దేశస్థుడు ఒక పరుగు
పందెంలో పాల్గొన్నారు. నిజానికి పందెంలో పాల్గొన్నవారు
ఇద్దరే. అమెరికా దేశస్థుడు గెలిచాడు. రష్యా దేశస్థుడు రెండవవాడిగా
వచ్చాడు. మరుసటి రోజు ఆ వార్తను రష్యా పత్రికలలో,
"మన దేశస్థుడు రెండవ స్థానాన్ని సాధించాడు !
అమెరికా దేశస్థుడు ఆఖరివాడికి ముందువాడిగా వచ్చాడు!!"
అని ప్రచురించారు.
విషయాలను ఇంకొక కోణంనుంచి ఎలా చూడవచ్చో
తెలుసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే...!!!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి