సినిమా ......
అన్ని మీడియాల లోకి శక్తివంతమైన మీడియా .......
ఏమీ ఆశించకుండా హీరోలను అభిమానులు అభిమానిస్తుంటారు...
హీరోలే కాదు నచ్చిన వారిని అభిమానిస్తుంటారు... అనుకరిస్తుంటారు...
హీరోలనైతే ఎక్కువ .. దీని గురించి చెప్పాల్సిన పనిలేదు.
అభిమాన సంఘాల వారు తమ హీరో సినిమాలు విడుదలైనపుడు , పుట్టినరోజులప్పుడు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.
అలాగే సినిమాలలో తమ అభిమాన హీరో చేసిన విధంగా చేయడానికీ ప్రయత్నిస్తుంటారు. ఆ హీరో చేసిన మంచిపనులను చేయడానికీ ప్రయత్నిస్తుంటారు.
చిరంజీవి బ్లడ్ బాంక్ , ఐ బాంక్ చాలా మంది అభిమానుల చేత మంచి పనులు చేయించింది.
పాత రోజులలో ఎన్.టీ.ఆర్ - కృష్ణ అభిమానులు చలివేంద్రాలు పెట్టడం , రోగులకు పండ్లు పంచడం లాంటి పనులు చేసే వారు.
సినిమా పవర్ మామూలుది కాదు.
అదేంటో ఎన్.టీ.ఆర్ , ఎం.జీ.ఆర్ లాంటి వాళ్లు చూపారు.
ఇప్పటికీ సమాజాన్ని అది బాగా ప్రభావితం చేస్తున్నది.
సమాజం పై ఇంతటి ప్రభావం చూపే సినిమాలో హీరోలు నిజజీవితం లో మాత్రం అలా ఉండడం అరుదు.
సినిమాలో చూపిన విధంగానే బయటా ఉండగలిగే వారిలో హీరో కృష్ణను, రజనీ కాంత్ ను ఉదాహరణ గా చెపుతారు.
జూనియర్ ఆర్టిస్ట్ నుండి నిర్మాతల వరకూ అభిమానించే హీరోలు అరుదుగా ఉంటారు.
ప్రస్తుత హీరోలలో మహేష్ బాబు లో ప్రొఫైల్ మైంటైన చేస్తుంటాడు.
వరుస హిట్ లతో వార్తలలోని వ్యక్తిగా మారాడు.
ఆ సందర్భం లో మహేష్ చెప్పిన కొన్ని నిర్ణయాలు లో ఒకటి - తాను సిగరెట్ మానడం.
మానడమే కాదు తన సినిమాలలో ఆ సీన్ లు ఉండవని చెప్పడం అభినందించదగ్గ విషయం.
కలెక్షన్ల కోసం , నంబర్ వన్ స్థానం కోసం పోటీపడే నేటి హీరోలు ఈ విషయం
లో ఈ నంబర్ వన్ (ప్రస్తుతం మహేషే కదా) హీరోను ఆదర్శం గా తీసుకోవాలి.
మిగతా హీరోలు కూడా ఇలాంటి మంచి పనులు చేయడం ద్వారా సమాజానికి తమవంతు సందేశం ఇవ్వవచ్చు. మేలు చేయవచ్చు.