8 మార్చి, 2012

నా కలలో నువ్వే. నా కళ్ళలో ను

నా కలలో నువ్వే. నా కళ్ళలో నువ్వే. నా కన్నీళ్ళలో నువ్వే.. నా కవిత లోను నువ్వే
నా శ్వాసనిస్వసలలో నువ్వే నా ఆశ లో నువ్వే నా ఆయువు లో నువ్వే నా ఆత్మ లోను నువ్వే..
నా నిన్న నువ్వే నా నేడు నువ్వే నా రేపు నువ్వే
నా వేదన నువ్వే..నా వేదం నువ్వే.. నా ఆది నువ్వే.. నా అంతం నువ్వే ..
నువ్వే.. నువ్వే.. నువ్వే ..నేను అనేది మరిచినా నాకు ..సమస్తం నువ్వే ..
నా ప్రాణం నీ పాదాలకే అంకితం ..
నా ఆయువు దీపం నాకు నేను గ అర్పుకోవటానికి.. నీ చివరి చూపుకై నా ఈ ఎదురు చూపు..
ఓ సారి కనిపిస్తే నీ రూపాన్ని కళ్ళ నిండా నింపుకొని, మరు జన్మకు కరునిస్తవనే కాంక్ష తో కళ్ళు మూస్తాను..

ఈ విషయం లో మహేష్ ను అభినందించాల్సిందే !

సినిమా ......
అన్ని మీడియాల లోకి శక్తివంతమైన మీడియా .......
ఏమీ ఆశించకుండా హీరోలను అభిమానులు అభిమానిస్తుంటారు...
హీరోలే కాదు నచ్చిన వారిని అభిమానిస్తుంటారు... అనుకరిస్తుంటారు...
హీరోలనైతే ఎక్కువ .. దీని గురించి చెప్పాల్సిన పనిలేదు.
అభిమాన సంఘాల వారు తమ హీరో సినిమాలు విడుదలైనపుడు , పుట్టినరోజులప్పుడు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.

అలాగే సినిమాలలో తమ అభిమాన హీరో చేసిన విధంగా చేయడానికీ ప్రయత్నిస్తుంటారు. ఆ హీరో చేసిన మంచిపనులను చేయడానికీ ప్రయత్నిస్తుంటారు.
చిరంజీవి బ్లడ్ బాంక్ , ఐ బాంక్ చాలా మంది అభిమానుల చేత మంచి పనులు చేయించింది.
పాత రోజులలో ఎన్‌.టీ.ఆర్ - కృష్ణ అభిమానులు చలివేంద్రాలు పెట్టడం , రోగులకు పండ్లు పంచడం లాంటి పనులు చేసే వారు.

సినిమా పవర్ మామూలుది కాదు.
అదేంటో ఎన్‌.టీ.ఆర్ , ఎం.జీ.ఆర్ లాంటి వాళ్లు చూపారు.
ఇప్పటికీ సమాజాన్ని అది బాగా ప్రభావితం చేస్తున్నది.
సమాజం పై ఇంతటి ప్రభావం చూపే సినిమాలో హీరోలు నిజజీవితం లో మాత్రం అలా ఉండడం అరుదు.
సినిమాలో చూపిన విధంగానే బయటా ఉండగలిగే వారిలో హీరో కృష్ణను, రజనీ కాంత్ ను ఉదాహరణ గా చెపుతారు.
జూనియర్ ఆర్టిస్ట్ నుండి నిర్మాతల వరకూ అభిమానించే హీరోలు అరుదుగా ఉంటారు.

ప్రస్తుత హీరోలలో మహేష్ బాబు లో ప్రొఫైల్ మైంటైన చేస్తుంటాడు.
వరుస హిట్ లతో వార్తలలోని వ్యక్తిగా మారాడు.
ఆ సందర్భం లో మహేష్ చెప్పిన కొన్ని నిర్ణయాలు లో ఒకటి - తాను సిగరెట్ మానడం.
మానడమే కాదు  తన సినిమాలలో ఆ సీన్‌ లు ఉండవని చెప్పడం అభినందించదగ్గ విషయం.

కలెక్షన్ల కోసం , నంబర్ వన్‌ స్థానం కోసం పోటీపడే నేటి హీరోలు ఈ విషయం లో ఈ నంబర్ వన్‌ (ప్రస్తుతం మహేషే కదా) హీరోను ఆదర్శం గా తీసుకోవాలి.
మిగతా హీరోలు కూడా ఇలాంటి మంచి పనులు చేయడం ద్వారా సమాజానికి తమవంతు సందేశం ఇవ్వవచ్చు. మేలు చేయవచ్చు.

మహేష్ బాబు ఇక నేషనల్ లెవల్ బిజినెస్‌మేన్‌ !

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరో మైలు రాయిని అందుకున్నారు. ఇప్పటి వరకు కేవలం మన రాష్ట్రం పరిధిలోనే పలు కార్పొరేట్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న మహేష్ తొలిసారిగా నేషనల్ స్థాయిలో డీల్ కుదుర్చుకున్నారు. ప్రస్తుతం థమ్సప్ సాప్ట్ డ్రింగ్ ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న ఈ హీరో థమ్స్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. 

ఇంతకు ముందు వరకు థమ్సప్ నేషనల్ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కొనసాగుతూ వచ్చాడు. అతనితో కాంట్రాక్టు ముగియడంతో మహేష్ బాబు ఆ ఛాన్స్ దక్కించుకున్నాడు. వరుస విజయాలతో రాష్ట్రంలోనే కాక రాష్ట్రం బయట కూడా రోజు రోజుకు పాపులర్ అవుతున్న మహేష్ బాబు వల్ల తమ కంపెనీ ఉత్పత్తులు మరింత పెరుగుతాయని ఆ కంపెనీ భావించి ఆయతో డీల్ కుదుర్చుకున్నట్లు మహేష్ బాబు సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

రాష్టం నుంచి ఈ ఘనత సాధించిన తొలి హీరో మహేష్ బాబే కావడం గమనార్హం. ప్రస్తుతం ఏపీ పరిధిలోనే మహేష్ బాబు బ్రాండ్ విలువ కొన్ని కోట్లలో ఉంది. మరి నేషనల్ స్థాయిలో మహేష్ బాబు విలువ ఏ రేంజ్‌లో ఉంటుందో మరికొన్ని రోజుల్లో వెల్లడి కానుంది.

28 ఫిబ్ర, 2012

మన స్టార్స్ అసలు పేర్లు తెలుసా !!

చిరంజీవి                            శివసంకర్ వరప్రసాద్
పవన్  కళ్యాణ్                    కళ్యాణ్  బాబు
మోహన్ బాబు                   బక్తవత్సలం నాయుడు
ప్రకాష్ రాజ్                         ప్రకాష్ రాయ్                                
సిద్దార్థ్ సూర్యనారాయణ్       సిద్దార్థ్                                          
సౌందర్య                             సౌమ్య
రమ్యకృష్ణ                            రమ్య  
రంభ                                   విజయలక్ష్మి
జయసుధ                           సుజాత
నయనతార                        డయానా  మారిం  కురియన్                                            
 ప్రియమణి                          ప్రియ  వాసుదేవ్  మని  అయ్యర్
 రవి తేజ                             రవి  శంకర్  రాజు 
ఏ . ఆర్ . రెహమాన్             ఏ. ఎస్ . దిలీప్  కుమార్
రాంగోపాల్ వర్మ            వివాదాల్ని వెతుకువాడు

శంకర్                   హై-బడ్జెట్,సూపర్ మూవీస్
కే .రాఘవేంద్రరావు          బొడ్డు సీన్ స్పెషల్
ఎస్.ఎస్.రాజమౌళి          యాక్షన్,హీరో చేతిలో ఏదో ఒక ఆయుధం
శ్రీను వైట్ల                మందు సీన్
కోడి రామకృష్ణ             మాయలు,మంత్రాలూ (గ్రాఫిక్స్)
వంశి                   కొత్తదనం (కానీ ఉండదు )
పవన్ కళ్యాణ్              ప్రేమ,యాక్షన్,రొమాన్స్
రవి బాబు                హారర్,త్రిల్
బాపు-రమణ              తెలుగుతనం ,ఫ్యామిలీ
 కే.విశ్వనాధ్               సంగీత ప్రాదాన్యం
శేఖర్ కమ్ముల             ఫ్యామిలీ టైపు,కూల్
గుణశేఖర్                సెట్ల పిచ్చి
పూరిజగన్నాథ్             యూత్ ,బూతు,లవ్
తేజ                    పేద-గొప్ప ప్రేమకధలు
వినాయక్                సుమోలు గాల్లో లేపడం
కృష్ణ వంశి               క్రియేటివ్ ,ఏక్షన్
ప్రభు దేవా               రిమీక్ల దర్శకుడు
ముత్యాల సుబ్బయ్య         సెంటిమెంట్
ఆర్.నారాయణమూర్తి         విప్లవం
దాసరి నారయణరావు         కలగూర గంప
కరుణాకరన్               ప్రేమ
జే.డి                   వర్మ చేసినవి రీమేక్


"దరిద్ర దేవోభవ , మూర్ఖదేవోభవ - పేదల్ని, నిరక్షరాస్యుల్ని, అజ్ఞానుల్ని, భాదితుల్ని మీ దేవుళ్ళుగా చేసుకోండి!"



మీరు మీ శరీరాన్ని, మనస్సుని, వాక్కుని ప్రపంచ 
సంక్షేమానికి (బహుజన  హితాయ) ధారపొయ్యాలి.
మీరు, "మాతృదేవోభవ, పితృదేవోభవ - మీ తల్లిని 
దేవునిగా చూడండి! మీ తండ్రిని  దేవునిగా చూడండి!" అని 
చదువుకున్నారు. కానీ నేను  చెప్పేదేమంటే, "దరిద్ర
దేవోభవ , మూర్ఖదేవోభవ - పేదల్ని, నిరక్షరాస్యుల్ని,
అజ్ఞానుల్ని, భాదితుల్ని మీ దేవుళ్ళుగా చేసుకోండి!"
వీరికి సేవ చెయ్యడమే అత్యున్నతమైన మతధర్మమని
తెలుసుకోండి.

ఒక్కో తార ఒక్కో జ్ఞాపకంలా మారి మెరుస్తుంది.


ప్రియా..!
పగలంతా ఏం చేసినా నీ ఆలోచనలు
రేయంతా నువ్వులేని ఒంటరితనపు జాడలు
ఇదిగో వెల్లకిలా పడుకొని
ఇలా వెన్నెలలో ఆకాశంకేసి చూస్తుంటే
ఒక్కో తార ఒక్కో జ్ఞాపకంలా మారి మెరుస్తుంది.
నన్ను మురిపిస్తూ నీకు దగ్గరగా ఉన్నంత ఓదార్పు ఇస్తున్నట్టుగా...

అక్కడ నిన్ను...ఇక్కడ నన్ను..చూస్తున్న చంద్రుడు మాత్రం
మన ప్రేమ అంత నిర్మలంగా నవ్వుతున్నాడు.
నువ్వు కుశలమే అని నాకు తెలుపుతున్నట్టుగా...!